- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా ధాన్యం కొనండి.. ఆర్డీవో కాళ్ల మీద పడ్డ రైతులు
by Shyam |
<p>దిశ, వరంగల్: జనగామ మండలంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆర్డీవో కాళ్ల మీద పడ్డారు. ఈ ఘటన సోమవారం కలెక్టరేట్ ఎదుట చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా, జనగామ మండలం అడవి కేశవపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో అధికారులు కొనడం లేదని బాధిత రైతులు కలెక్టరేట్ ఆవరణలో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకుని వారికి […]</p>

X
దిశ, వరంగల్: జనగామ మండలంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆర్డీవో కాళ్ల మీద పడ్డారు. ఈ ఘటన సోమవారం కలెక్టరేట్ ఎదుట చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా, జనగామ మండలం అడవి కేశవపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో అధికారులు కొనడం లేదని బాధిత రైతులు కలెక్టరేట్ ఆవరణలో ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే పలువురు రైతులు తాము తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీవో కాళ్ల మీద పడి గోడును వెళ్లబోసుకున్నారు.
tags: rto, collectorate, farmers, fall on rt foot, neglect on rice purchase
Next Story






