Breaking: ఖమ్మం మార్కెట్‌లో టెన్షన్.. జెండా పాట అడ్డగింత

489
Khammam market

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి కొనుగోలు వివాదాస్పదంగా మారి జెండా పాటను రైతులు అడ్డుకున్నారు. ముందుగా జెండా పాట రూ.16500 అనడంతో సమస్య మొదలైంది. సోమవారం రూ.19000 నుండి 19500 వరకు కొనుగోలు చేసి ఈరోజు(మంగళవారం) రేటు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే మార్కెట్‌లోకి ప్రవేశించి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చేస్తున్నారు.