వ్యవసాయమే అతని జీవనం.. ఉసూరుమనిపించింది

73

దిశ, హుజూరాబాద్ : సైదాపూర్ మండలం గుజ్జులపల్లి గ్రామానికి చెందిన మ్యాకల రవి (34) అనే యువ రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. మ్యాకల రవి తనకు చెందిన 4 ఎకరాల వ్యవసాయ భూమిలో పెసరు పంటను సాగు చేస్తున్నాడు. పంట సాగు కోసం రూ.8 లక్షలు అప్పు చేశాడు.

పంట దిగుబడి రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలనే దిగులుతో బుధవారం రవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ రావు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..