- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తి దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గోపాల్ (50) అనే రైతు.. వ్యవసాయ పనుల నిమిత్తం ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు రాత్రి రెండు గంటల సమయంలో వేట కొడవళ్లతో తల నరికి చంపారు. సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన స్థానికులు.. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గోపాల్ (50) అనే రైతు.. వ్యవసాయ పనుల నిమిత్తం ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు రాత్రి రెండు గంటల సమయంలో వేట కొడవళ్లతో తల నరికి చంపారు. సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన స్థానికులు.. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. పాత కక్షలే హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tags: farmer, murder, laxmipur, mahabubnagar, ts
Next Story






