- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదాతల ఉసురుతీస్తున్న అప్పులు..
<p>దిశ, కౌడిపల్లి : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ గ్రామంలో అప్పుల బాధతో యువ రైతు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రాయిలాపూర్‌కు చెందిన మంగలి అంజయ్య, భారతమ్మ కొడుకు శ్రీనివాస్ (39) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఇటీవలే అనారోగ్యంతో 4 నెలల కిందట మృతి చెందింది. రూ. 3 లక్షలకు పైగా అప్పులు కావడంతో అవి ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ శుక్రవారం […]</p>

X
దిశ, కౌడిపల్లి : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ గ్రామంలో అప్పుల బాధతో యువ రైతు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రాయిలాపూర్‌కు చెందిన మంగలి అంజయ్య, భారతమ్మ కొడుకు శ్రీనివాస్ (39) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఇటీవలే అనారోగ్యంతో 4 నెలల కిందట మృతి చెందింది.
రూ. 3 లక్షలకు పైగా అప్పులు కావడంతో అవి ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ శుక్రవారం ఉదయం తన ఇంటి దగ్గర ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు శ్రీనివాస్ తనకున్న వ్యవసాయ పొలాన్ని చేసుకుంటూనే మరోవైపు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తు్న్నాడు. మృతుని తల్లి భారతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






