- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంటకు నిప్పు పెట్టారు.. నేను చచ్చిపోతా..!
by Aamani |
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన శనగ పంటకు నిప్పుపెట్టారని ఆవేదన చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కస్ర శివారులో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మడిగెలవర్ సాయన్న 3 ఎకరాల భూమిలో శనగ సాగు చేశాడు. శనగ పంటను కోసి నూర్పిడి కోసం ఒక్క దగ్గర కుప్పగా వేసనని రైతు తెలిపాడు. దానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఆగ్నికి ఆహుతయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 30క్వింటాళ్ల వరకు పంట నష్టం వాటిల్లిందని వాపోయాడు. మనస్తాపం చెందిన సాయన్న ఇంటికి వచ్చి నేరుగా గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా గమనించిన గ్రామస్తులు వెంటనే తలుపులు బద్దలు కొట్టి రక్షించారు.
Advertisement
Next Story