పత్తి చేనులో గంజాయి మొక్కల సాగు.. ఎక్కడంటే?

by  |
పత్తి చేనులో గంజాయి మొక్కల సాగు.. ఎక్కడంటే?
X

దిశ, ఆందోల్ : సంగారెడ్డి జిల్లాలో గంజాయి మొక్కల సాగు కలకలం రేపింది. ఈ ఘటన వట్‌పల్లి మండలం మరవెళ్లి శివారులోని పత్తి పొలంలో సోమవారం వెలుగుచూసింది. పత్తికి అంతర పంటగా వేసి గుట్టు చప్పుడు కాకుండా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. మేడికుంద మల్లయ్య అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్టు తెలిపారు.

ఈ దాడుల్లో 60 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేశామన్నారు. వీటి విలువ సుమారుగా రూ.1.50 లక్ష వరకు ఉంటుందన్నారు. గంజాయి మొక్కలను సాగు చేస్తున్న మల్లయ్యపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ విఠల్, సిబ్బంది అనిల్, సతీష్, గోపాల్‌లు ఉన్నారు.


Next Story