మీరు ఒక్కసారైనా కలుస్తారా.. వారి ఆవేదన వర్ణనాతీతం

by  |
మీరు ఒక్కసారైనా కలుస్తారా.. వారి ఆవేదన వర్ణనాతీతం
X

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దవాళ్లు అంటూ ఉంటారు.. పెళ్లి చేసుకున్న జంట చూడ చక్కగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉండాలని.. అలాంటి జంటనే నాగచైతన్య, సమంత. ఈ జంటను చూసిన వారు ఎవరైనా కుళ్లుకోకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లో బ్యూటిఫుల్ కపుల్ ఎవరైనా ఉన్నారా.. అంటే అది వీరే. ఇక ఈ జంట అంటే ఇష్టపడే అభిమానులు ఎంతో మంది ఉంటారు. ఎంతో మందికి ఈ జంట ఫేవరేట్. టాలీవుడ్‌లో కూడా ఈ జంటను ఇష్టపడేవారు అనేకం. అలాంటి వారు విడిపోవడంతో అటూ సినిమా ఇండస్ట్రీ.. ఇటు అభిమానులు షాక్‌లో మునిగిపోయారు.

ఏమాయ చేసావే‌తో అభిమానుల మనసు దోచుకున్న ఈ జంట.. వీరు నిజంగా పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది కోరుకున్నారు. వారి కోరికలు నిజమై ఎట్టకేలకు వారు వివాహం చేసుకున్నారు. దీంతో ఆన్ స్క్రీన్ భార్యాభర్తలను ఆఫ్ స్క్రీన్ భార్యాభర్తలుగా చూసి చాలా ముచ్చటపడ్డారు అభిమానులు. ప్రస్తుతం పలు కారణాల వల్ల వీరు రియల్ లైఫ్‌లో కపుల్‌గా విడిపోయారు. కానీ వీరి విడాకుల వార్త అబద్ధం అయితే బాగుండు అని ఇప్పటికీ ఎంతో మంది కోరుకుంటున్నారు. కానీ అది జరిగేలా లేదు.. అందు కోసమే అభిమానులు వీరి నుంచి ఒకటి కోరుకుంటున్నారు. అది ఏంటీ అనుకుంటున్నారా.. పెళ్లి కాక ముందు ఏమాయ చేసావే సినిమాలో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి చాలా క్రేజ్ ఉంది. అందుకే విడాకులు అయినా కూడా వారు ఎవర్‌గ్రీన్ ఆన్ స్క్రీన్ కపుల్‌గానే ఉండాలని చాలామంది కోరిక.

ఇక వీరు చేసిన ట్వీట్‌లో మేము స్నేహితులుగా కొనసాగుతామని తెలియజేశారు. దీంతో వీరు విడాకులు అయినా కూడా ఎవర్‌గ్రీన్ ఆన్ స్క్రీన్ కపుల్‌గానే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతే కాకుండా నిర్మాతలు కూడా అదే ఫీలింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వీరు నిజ జీవితంలో కాకుండా తెరపైన అయినా భార్యభర్తలుగా కలసి నటిస్తారో.. అభిమానుల కోరిక నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed