నిధి మాత్రమే కాదు.. తన మనసు కూడా అందమే!

by  |
Nidhi Agarwal
X

దిశ, సినిమా : ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు తన అభిమానులు తమిళనాడులో గుడి కట్టించి అభిషేకం చేసిన విషయం తెలిసిందే. చాలా కొద్ది మంది నటులకు మాత్రమే ఇలాంటి భాగ్యం కలగగా, ఆ లిస్ట్‌లో చేరిపోయిన నిధి.. ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్తూనే ఆ గుడిని ఉండేందుకు చోటులేని వారికోసం కేటాయించాలని కోరి మరోసారి ప్రశంసలు అందుకుంది. కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్న నిధి.. ఈ సినిమా సెట్స్‌లో ‘హెల్పింగ్ హ్యాండ్స్ వెంకట్’ అనే స్వచ్ఛంధ సంస్థకు చెందిన టీమ్‌ను కలిసింది. గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించే వెంకట్ అండ్ టీమ్.. పేదలకు సేవ చేయడంలో ముందుంటారని తెలిపింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్, జంతువుల సంరక్షణ కార్యక్రమాలు చేపడతారని చెప్పింది. తను చేసే సోషల్ సర్వీస్‌కు మద్దతిస్తున్నానని, అభిమానులు కూడా సపోర్ట్ చేయాలని కోరింది నిధి.


Next Story

Most Viewed