- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థియేటర్ అద్దాలను ధ్వంసం చేసిన బాలయ్య ఫాన్స్!
by Sridhar Babu |
<p>దిశ, నాగర్‌కర్నూల్: నందమూరి బాలయ్య ఫాన్స్ కి కోపమొచ్చింది. సినిమా నడుస్తున్న క్రమంలో సౌండ్ సిస్టమ్ బాలేదని అభిమానులు కోపంతో ఊగిపోయారు. గురువారం బాలకృష్ణ నటించిన అఖండ సినిమాని జిల్లా కేంద్రంలోని రామకృష్ణ థియేటర్లలో రిలీజ్ చేశారు. కాగా థియేటర్ నిర్వాహకులు ప్రేక్షకులకు, అభిమానులకు కనీస సౌలతులు ఏర్పాటు చేయకుండానే టికెట్ ధర మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ అభిమాన హీరో కావడంతో ధరలు పెంచినా సహించారు. కానీ.. సినిమా నడుస్తున్న క్రమంలో కుర్చీలు […]</p>

X
దిశ, నాగర్‌కర్నూల్: నందమూరి బాలయ్య ఫాన్స్ కి కోపమొచ్చింది. సినిమా నడుస్తున్న క్రమంలో సౌండ్ సిస్టమ్ బాలేదని అభిమానులు కోపంతో ఊగిపోయారు. గురువారం బాలకృష్ణ నటించిన అఖండ సినిమాని జిల్లా కేంద్రంలోని రామకృష్ణ థియేటర్లలో రిలీజ్ చేశారు. కాగా థియేటర్ నిర్వాహకులు ప్రేక్షకులకు, అభిమానులకు కనీస సౌలతులు ఏర్పాటు చేయకుండానే టికెట్ ధర మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ అభిమాన హీరో కావడంతో ధరలు పెంచినా సహించారు. కానీ.. సినిమా నడుస్తున్న క్రమంలో కుర్చీలు సక్రమంగా లేకపోవడం, సౌండ్ సిస్టం విడుదల చేయకపోవడంతో పెద్ద పెట్టున అరిచి కేకలు వేస్తూ అద్దాలను, కుర్చీలను ధ్వంసం చేశారు. దీంతో కొద్దిసేపు థియేటర్లో గందరగోళం నెలకొంది.
Next Story






