రవాణా శాఖకు ఫ్యాన్సీ ఆదాయం

by  |
Fancy number
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు తగ్గినా ఫ్యాన్సీ నెంబర్ల డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా రాష్ట్రంలో ఓ ఫ్యాన్సీ నంబర్‌ భారీ రేటు పలికింది. శుక్రవారం ఒక్కరోజే రవాణా శాఖకు ఆన్​లైన్​ ద్వారా నిర్వహించిన వేలంలో రూ. 31,48,487 ఆదాయం వచ్చింది. మూడు ఫ్యాన్సీ నెంబర్లకు అత్యధిక ధర పలికింది.

టీఎస్​ 09 ఎఫ్​కే 9999 నెంబర్​ను ఆర్ఎస్ బ్రదర్స్​సంస్థ రూ. 9.14 లక్షలతో సొంతం చేసుకుంది. టీఎస్​ 09ఎఫ్​ఆర్​ 9999 నెంబర్‌ను ఓ వాహనదారుడు రూ.7.6 లక్షలతో సొంతం చేసుకున్నాడు. అదే విధంగా టీఎస్​ 09 ఎఫ్​ఎల్​ 0001 నెంబర్​ను లహరి ఇన్​ఫ్రా ప్రైవేట్​ లిమిటెడ్​ రూ. 3.81 లక్షలు, టీఎస్​ 09ఎఫ్​ఎల్​ 0099 నెంబర్​ను అస్మిత పద్మనాభవన్​ రూ. 3.33 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తంగా 9999 నంబర్‌ మరోసారి రికార్డు ధరకు అమ్ముడైంది.

సాధారణంగా ఈ సంఖ్యకు చాలా పోటీ ఉంటుంది. లాక్‌డౌన్‌లో తొలిసారి ఓ ఫ్యాన్సీ నంబర్‌ను వేలంలో పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్లపై ఒక్క రోజే ఆదాయం రూ.31 లక్షలు దాటింది.



Next Story

Most Viewed