ప్లీజ్ రోహిత్.. IND VS PAK మ్యాచ్‌కు 2 టికెట్స్ ఇప్పించవా..?

by  |
ప్లీజ్ రోహిత్.. IND VS PAK మ్యాచ్‌కు 2 టికెట్స్ ఇప్పించవా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ ఈనెల 17 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. లీగ్ మ్యాచెస్ విషయానికొస్తే అక్టోబర్-24న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ పైనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి నుంచే ఆ మ్యాచ్ టికెట్స్ సంపాదించేందుకు ఫ్యాన్స్ ప్రయత్నాలు సైతం ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఐపీఎల్ ముంబై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అభిమాని ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం రెండు టికెట్స్ ఇప్పించాలని పోస్టర్ ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ప్లీజ్.. రోహిత్ నీడ్ 2 టికెట్స్ ఫర్ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. అని పోస్టర్ పై రాసి ఉంది. దీనిని బట్టి అక్టోబర్-24న జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Next Story