జూన్ 15 దాకా ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియాలు బంద్

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం మరోదఫా పొడిగించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండయా(ఏఎస్ఐ) పర్యవేక్షణలోని 3,693 కట్టడాలు, 50 మ్యూజియాలను వచ్చే నెల 15వ తేదీ దాకా మూసే ఉంచనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. మే 15 వరకు ఉన్న ఆంక్షలను మే 30 వరకు చివరిసారి పొడిగించగా, తాజాగా, వాటినే జూన్ 15కు ఎక్స్‌టెండ్ చేసింది. గతేడాది కూడా కరోనా కేసులు పెరగడంతో మార్చి 17న వీటిని మూసేసింది. తర్వాత [&hellip;]</p>

జూన్ 15 దాకా ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియాలు బంద్
X

న్యూఢిల్లీ: ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం మరోదఫా పొడిగించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండయా(ఏఎస్ఐ) పర్యవేక్షణలోని 3,693 కట్టడాలు, 50 మ్యూజియాలను వచ్చే నెల 15వ తేదీ దాకా మూసే ఉంచనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. మే 15 వరకు ఉన్న ఆంక్షలను మే 30 వరకు చివరిసారి పొడిగించగా, తాజాగా, వాటినే జూన్ 15కు ఎక్స్‌టెండ్ చేసింది. గతేడాది కూడా కరోనా కేసులు పెరగడంతో మార్చి 17న వీటిని మూసేసింది. తర్వాత జులైలో పలు నిబంధనలతో వీటిని సందర్శకులకు తెరిచింది.

Next Story