విషాదంలో ఇండస్ట్రీ.. కమెడియన్ పొట్టి వీరయ్య ఇకలేరు

by Vadlamudi Anukaran |

<p>దిశ, సినిమా: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, ఫణిగిరికి చెందిన ప్రముఖ కమెడియన్ పొట్టి వీరయ్య ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సన్‌షైన్ ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించారు. వీరయ్య మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరయ్య మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని నివాళి అర్పిస్తున్నారు. పుట్టుకతోనే మరుగుజ్జు అయిన వీరయ్య తెలుగు, తమిళ్, కన్నడ మలయాళ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించారు. ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ [&hellip;]</p>

famous comedian potti veeraih
X

దిశ, సినిమా: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, ఫణిగిరికి చెందిన ప్రముఖ కమెడియన్ పొట్టి వీరయ్య ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సన్‌షైన్ ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించారు. వీరయ్య మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరయ్య మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని నివాళి అర్పిస్తున్నారు. పుట్టుకతోనే మరుగుజ్జు అయిన వీరయ్య తెలుగు, తమిళ్, కన్నడ మలయాళ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించారు. ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వీరయ్య దర్శకరత్న దాసరి నారాయణరావు ‘తాతా మనవడు’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు. ఇక ఆయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Next Story