- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచం ఇవ్వలేదని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
<p>దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. తమ ఇంటిని అక్రమంగా కూల్చారని నిరసిస్తూ ఓ కుటుంబం మున్సిపల్ ఆఫీసు ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు రెవెన్యూ సిబ్బంది తమను లంచం డిమాండ్ చేశారని, దానికి నిరాకరించడంతో కావాలనే ఇంటిని కూల్చారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబం శుక్రవారం ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. తమ ఇంటిని అక్రమంగా కూల్చారని నిరసిస్తూ ఓ కుటుంబం మున్సిపల్ ఆఫీసు ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు రెవెన్యూ సిబ్బంది తమను లంచం డిమాండ్ చేశారని, దానికి నిరాకరించడంతో కావాలనే ఇంటిని కూల్చారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబం శుక్రవారం ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Next Story






