ఇర్ఫాన్ అంత్యక్రియలు పూర్తి…

by  |
ఇర్ఫాన్ అంత్యక్రియలు పూర్తి…
X

ప్రపంచ సినిమా రంగం గర్వించదగిన నటుల్లో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతుంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. 2018 నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న ఇర్ఫాన్…. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కాగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వర్సోవా స్మశానవాటికలో ఇర్ఫాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. లాక్ డౌన్ ఉండడం… సామాజిక దూరాన్ని పాటించాల్సి రావడంతో చాలా కొద్ది మంది మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు బంధువులు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం… ముస్లిం సంప్రదాయం ప్రకారం వీడ్కోలు పలికారు.

ఇర్ఫాన్ చివరి మాటలు…
అమ్మ నన్ను తీసుకెళ్లడానికి వచ్చింది

Tags: Irfan Khan, British Films, Bollywood, Hollywood

Next Story