చర్చిలో దంపతుల సూసైడ్.. అస్థికలు భద్రాద్రిలో కలపాలని రిక్వెస్ట్

by  |
చర్చిలో దంపతుల సూసైడ్.. అస్థికలు భద్రాద్రిలో కలపాలని రిక్వెస్ట్
X

దిశ, నర్సంపేట/ ప‌ర‌కాల‌ : ఎన్‌పీడీసీఎల్‌లో ఉద్యోగాలిప్పిస్తామ‌ని ద‌ళారులు మోసం చేయ‌డంతో నిరుద్యోగుల వ‌ద్ద డ‌బ్బులు వ‌సూలు చేయించి ఇచ్చిన దంప‌తులు పురుగుల మందుతాగి చ‌ర్చిలో ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘ‌ట‌న వ‌రంగ‌ల్‌ రూర‌ల్ జిల్లా ప‌ర‌కాల సీఎస్‌ఐ చ‌ర్చిలో శుక్రవారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. మృతులు తాళ్లపెళ్లి కేశవ స్వామి(45), సంధ్యా రాణి (40) దంపతులుగా గుర్తించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా దుగ్గొండి మండ‌లంలోని పోనకల్ గ్రామం స్వస్థలం. సూసైడ్‌కు సంబంధించిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ప్రస్తుతం హన్మకొండలో నివాసం ఉంటున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

కేశ‌వ స్వామి త‌న‌ సూసైడ్ వీడియోలో పేర్కొన్న వాంగ్ములం ప్రకారం.. కేశవస్వామికి కొన్ని నెలల కిందట ధర్మసాగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న పుల్ల బాబు, కాంట్రాక్టర్ వాలూ నాయక్, గాడిపెళ్లి వెంకటేష్‌ల‌తో ప‌రిచ‌యం ఏర్పడింది. ఎన్‌పీడీసీఎల్ ప‌రిధిలోని విద్యుత్ శాఖ‌లో వివిధ స్థాయిల్లోని కాంట్రాక్టు ఉద్యోగాలిప్పిస్తాన‌ని చెప్పి నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో కేశ‌వ స్వామి ద్వారా డ‌బ్బులు వ‌సూలు చేయించారు. కరెంట్ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, సబ్ స్టేషన్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ తదితర పోస్టులకు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా డబ్బులు వసూలు చేయించారు. ఈ పోస్టులకు సంబంధించిన నకిలీ ఆర్డర్ కాపీలను సైతం అందజేశారు.

నర్సంపేట, వరంగల్, జనగామ, అచ్చంపేట, ములుగు, డోర్నకల్ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున కేశవస్వామికి డబ్బులు చెల్లించారు. పుల్ల బాబుకి 40లక్షలు, గాడిపెళ్లి వెంకటేష్‌కి 17 లక్షలు, వాలూ నాయక్ కి 3 లక్షల 24 వేలు కేశవ స్వామి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇదిలా ఉండగా రోజులు గడుస్తున్నా జాబ్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో డబ్బులు చెల్లించిన వారి నుంచి కేశవస్వామికి ఒత్తిడి ఎక్కువైంది. తాము చెల్లించిన డబ్బులు వెంటనే తిరిగివ్వాలని ఒత్తిడి చేయసాగారు. డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని కోరినా.. పుల్ల బాబు, కాంట్రాక్టర్ వాలూ నాయక్, గాడిపెళ్లి వెంకటేష్‌ల‌ను నుంచి స‌రైన స‌మాధానం లేక‌పోవడంతో మోస పోయిన‌ట్లు గ్రహించాడు.

దళారుల మొండితనంతో ఆర్థికంగా చితికిపోయానని, తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురైన‌ట్లుగా పేర్కొన్నాడు. దీనికితోడు తన రెండో భార్యను చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వాపోయాడు. ఈ నేపథ్యంలోనే వ‌రంగ‌ల్‌ పోలీస్ క‌మిష‌న‌ర్ త‌రుణ్ జోషికి త‌న సూసైడ్ వీడియోను మ‌ర‌ణ వాంగ్ములంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ముగ్గురు ద‌ళాల‌రుపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవ‌డంతో పాటు నిరుద్యోగుల‌కు డ‌బ్బులు ఇప్పించాల‌ని కోరాడు. అలాగే, తన రెండో భార్య, పిల్లలకు కూడా న్యాయం చేయాలంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు బాధిత దంపతులు. చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నామని.. తమ అస్థికలను భద్రాద్రిలో కలుపాలని ఏడుస్తూ కొడుకును కోరాడు తండ్రి కేశవస్వామి.



Next Story