- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరవరరావును కలిసేందుకు వారికైతే ఒకే..
<p>దిశ, వెబ్ డెస్క్: భీమా కోరెగావ్ కేసులో నిర్బంధానికి గురైన విరసం నేత వరవరరావును కలిసేందుకు ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఆయన్ను కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో బాంబే హైకోర్టు అనుమతించింది. ఇటివలే కరోనా బారిన పడిన వరవరరావు ప్రస్తుతం నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రి వద్ద కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతిచ్చింది బాంబే హైకోర్టు. వరవరరావును విడుదల చేయాలంటూ కొన్ని రోజులుగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భీమా కోరెగావ్ కేసులో నిర్బంధానికి గురైన విరసం నేత వరవరరావును కలిసేందుకు ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఆయన్ను కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో బాంబే హైకోర్టు అనుమతించింది. ఇటివలే కరోనా బారిన పడిన వరవరరావు ప్రస్తుతం నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ఆస్పత్రి వద్ద కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతిచ్చింది బాంబే హైకోర్టు. వరవరరావును విడుదల చేయాలంటూ కొన్ని రోజులుగా ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం గురించి పలుమార్లు మహారాష్ట్ర హోంమంత్రికి ఆయన భార్య లేఖ కూడా రాశారు.
Next Story






