- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వద్దన్నా వ్యాక్సిన్ వేశారు.. నాలుగు రోజులకే వృద్ధురాలి మృతి..? (వీడియో)
<p>దిశ, మహదేవ్‌పూర్ : ఆరోగ్యం బాగాలేని వృద్ధురాలికి బలవంతంగా కరోనా వ్యాక్సిన్ వేయడంతో అస్వస్తతకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం ఎడపల్లి గ్రామంలో జరిగింది. కరోనా వ్యాక్సిన్‌ను పకడ్బందీగా పంపిణీ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అందులో భాగంగానే నాలుగు రోజుల క్రితం మహదేవ్‌పూర్ మండలంలోని ఎడపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ క్రమంలో రాపెళ్లి సరోజన […]</p>

X
దిశ, మహదేవ్‌పూర్ : ఆరోగ్యం బాగాలేని వృద్ధురాలికి బలవంతంగా కరోనా వ్యాక్సిన్ వేయడంతో అస్వస్తతకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం ఎడపల్లి గ్రామంలో జరిగింది. కరోనా వ్యాక్సిన్‌ను పకడ్బందీగా పంపిణీ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అందులో భాగంగానే నాలుగు రోజుల క్రితం మహదేవ్‌పూర్ మండలంలోని ఎడపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ క్రమంలో రాపెళ్లి సరోజన తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెబుతున్నా.. వినకుండా వైద్య సిబ్బంది బలవంతంగా వ్యాక్సిన్ వేశారని ఆమె కుటుంబీకులు తెలిపారు. టీకా వేసిన నాలుగు రోజులు కాకముందే వృద్ధురాలు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యాధికారులు స్పందించాల్సి ఉంది.
- Tags
- Mahadevpur
Next Story






