'రక్షణ' కోసం ఫేస్‌బుక్‌లో కొత్త ఎమోజీ!

by  |
రక్షణ కోసం ఫేస్‌బుక్‌లో కొత్త ఎమోజీ!
X

దిశ, వెబ్‌డెస్క్:
అందరూ ఇంట్లోనే ఉన్నపుడు కాలక్షేపానికి ఫేస్‌బుక్‌ను ఆశ్రయిస్తున్నారు. వాళ్లను అలాగే కాపాడుకోవడానికి సందర్భానికి తగినట్లుగా ఒక కొత్త ఎమోజీని ఫేస్‌బుక్ పరిచయం చేసింది. పోస్టు కింద లైకుతో పాటు ఇప్పటివరకు హృదయం, షాక్, బాధ, కోపానికి సంబంధించిన ఎమోజీలు ఉన్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు రక్షణ ఎమోజీని కూడా పరిచయం చేయనున్నారు.

చేతిలో హృదయం పెట్టుకుని మనవాళ్లను సంరక్షిస్తున్నట్లుగా ఉన్న ఈ ఎమోజీని వచ్చే వారంరోజుల్లో ఫేస్‌బుక్ ప్రధాన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతానికి వేరే మెసేంజర్‌లో మాత్రం కొట్టుకుంటున్న హృదయం ఎమోజీని రక్షణకు మారుపేరుగా అందుబాటులో ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి గురించి మరొకరు రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ఎమోజీని తీసుకొచ్చినట్లు ఫేస్‌బుక్ తన బ్లాగులో పేర్కొంది. దూరంగా ఉన్నప్పటికీ దగ్గరగా ఉన్న భావనను కలిగించడానికి, పెద్ద భావోద్వేగాన్ని చిన్న ఎమోజీతో తెలిపే అవకాశాన్ని కల్పించినందుకు నెటిజన్లు ఫేస్‌బుక్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Tags: Facebook, New Emoji, Happy,Like, share, Heart, care



Next Story