ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మార్పు!

by  |
ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మార్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ సోషల్ మీడియాలో సంచలనంగా కొనసాగుతున్న ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్. తాజాగా ఈ సంస్థ పేరు మార్చుకుంది. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అయిన మెటావర్స్‌కు ప్రాధాన్యత పెరగనుంది. ఈ తరుణంలో ఫేస్‌బుక్‌ పేరును ‘మెటా’గా మారుస్తున్నట్టు సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు. ఇది ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరులో మార్పు మాత్రమే అని, సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల పేర్లలో ఎటువంటి మార్పులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ను కేవలం ఒక సోషల్ మీడియా కంపెనీగా పరిగణిస్తున్నారని, కానీ ఇది ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంచి సాంకేతికతను అందించే సంస్థ అని జుకర్‌బర్గ్ అన్నారు. రాబోయే పదేళ్లలో 100 కోట్ల మందికి పైగా ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తారన్నారు. అంతేకాకుండా లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు.



Next Story

Most Viewed