'#ResignModi'.. పొరపాటు మాత్రమే.. ప్రభుత్వ ఒత్తిడి కాదన్న ఫేస్‌బుక్

by  |
#ResignModi.. పొరపాటు మాత్రమే.. ప్రభుత్వ ఒత్తిడి కాదన్న ఫేస్‌బుక్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా చాపకింద నీరులా కరోనా అంతకంతకు ఎక్కువవుతుంది. ఆసుపత్రిలో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. దేశంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్లు ప్రవర్తిస్తుంది. క‌రోనా సెకండ్ వేవ్‌ను ఊహించ‌డంలో విఫ‌ల‌మ‌వ‌డంతోపాటు ఆక్సిజ‌న్ వంటి క‌నీస వైద్య స‌దుపాయాలను కొవిడ్ పేషెంట్లు అందించ‌డంలో విఫ‌ల‌మైన ప్ర‌ధాని మోడీ ప‌ద‌విలో నుంచి దిగిపోవాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘#ResignModi’ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ గా మార్చారు. ఈ ట్యాగ్ తో మోడీ రిజైన్ చేయాలని పోస్ట్ లను పెడుతున్నారు.

కరోనా సంక్షోభంతో దేశం ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనే డిమాండ్ లు ఫేస్‌బుక్ లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న పోస్టుల‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీంతో నెటిజన్లు ఫేస్‌బుక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్ మోడీకి మద్దతు పలుకుతుందని, ప్రభుత్వం ఒత్తిడి చేయడంతోనే ఫేస్‌బుక్ పోస్టులను డిలేట్ చేసిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫేస్‌బుక్ స్పందించింది. పొరపాటున ‘#ResignModi’ అనే హ్యాష్ ట్యాగ్ డిలేట్ అయ్యిందే తప్ప, ప్రభుత్వ ఒత్తిడితో కాదని, అందుకే వెంటనే హ్యాష్ ట్యాగ్ ని రిస్టోర్ చేసినట్లు వివరణ ఇచ్చింది.


Next Story

Most Viewed