‘ఎఫ్3’ ఫన్ రైడ్ వచ్చేస్తోంది!

by  |
‘ఎఫ్3’ ఫన్ రైడ్ వచ్చేస్తోంది!
X

దిశ, వెబ్‌డెస్క్ : విక్టరీ వెంకటేష్ జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేసిన ‘నారప్ప’ మూవీ యూనిట్.. ఆయన అభిమానులకు ఒక రోజు ముందుగానే బర్త్‌డే ట్రీట్ ఇచ్చింది. టీజర్‌లో వెంకీ చూపించిన రౌద్రం, కోపం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా వెంకీ బర్త్‌డే సంబరాల్లో ఖుషీఖుషీగా ఉన్న ఫ్యాన్స్‌కు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్.. మరో తీపి కబురందించాడు.

https://twitter.com/IAmVarunTej/status/1338001377000267777?s=20

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన ‘ఎఫ్2’ చిత్రం సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ఎండింగ్‌లోనే అనౌన్స్ చేయగా, ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ సస్పెన్స్‌కు తెరదించిన వరుణ్ తేజ్.. వెంకీ బర్త్ డే సందర్భంగా ‘ఎఫ్3’ పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తూ ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘మరిన్ని ఎక్కువ నవ్వులు పంచడానికి మరోసారి మీ ముందుకు వస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ‘ఎఫ్3’ అనౌన్స్‌మెంట్‌తో వెంకీ ఫ్యాన్స్ డబుల్ హ్యాపీనెస్‌లో ఉన్నారు.


Next Story

Most Viewed