రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కోపంతో బారికేడ్లను ఎత్తేసిన కార్యకర్తలు

177

దిశ, జడ్చర్ల: పాలమూరు జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించే జంగ్ సైరన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యక్రమానికి బయలుదేరిన సమయంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారి మీదుగా పట్టణంలోకి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రవేశించకుండా పోలీసులు ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేసి.. జాతీయ రహదారి మీదుగా ర్యాలీ వెళ్లాలని సూచించారు. కానీ, పట్టణం నుంచే ర్యాలీ నిర్వహిస్తామని కార్యకర్తలు పట్టుబడడంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో కార్యకర్తలు బారికేడ్లను ఒక్కసారిగా ఎత్తివేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..