దేశ ఎగుమతులు 22 శాతం పెరిగాయి

by  |
దేశ ఎగుమతులు 22 శాతం పెరిగాయి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు కరోనా సంక్షోభం నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ ఎగుమతులు నవంబర్ తొలివారంలో వార్షిక ప్రాతిపదికన 22.47 శాతం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వారంలో దేశ ఎగుమతులు సుమారు రూ. 49.9 వేల కోట్లకు చేరుకున్నాయి.

గతేడాది నవంబర్ తొలి వారంలో దేశ ఎగుమతులు రూ. 40.7 వేల కోట్లుగా నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దిగుమతులు 13.64 శాతం పెరిగి రూ. 68.8 వేల కోట్లకు చేరుకున్నాయి. ఈ వారం వ్యవధిలో పెట్రోలియం మినహా దిగుమతులు 23.37 శాతం పెరిగాయని ఓ అధికారి తెలిపారు.

అలాగే, ఈ వారంలో వాణిజ్య లోటు రూ. 18.8 వేల కోట్లుగా ఉంది. ఔషధ ఎగుమతులు 32 శాతం, రత్నాలు, ఆభరణాలు 88.8 శాతం పెరిగాయని అధికారిక గణాంకాలు తెలిపాయి. అంతేకాకుండా, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు ఈ వారంలో 16.7 శాతం పెరిగాయి. ఇక, పెట్రోలియం, తోలు వస్తువులు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఈ వారం రోజుల్లో మన దేశం నుంచి ఎగుమతులు అమెరికాకు 53.91 శాతం, హాంకాంగ్‌కు 176.2 శాతం, సింగపూర్‌కు 90.76 శాతం పెరిగాయి.


Next Story

Most Viewed