- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారులో పేలుడు పదార్థాలు పట్టివేత
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో కారులో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. బొమ్మలరామారం మండలం పెద్దపర్వాతపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న ప్రవీణ్, రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మరో నిందితుడు భాస్కర్ రెడ్డి పరారీలోఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కాటన్ పెట్టెల్లో 3000 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. బాల్‌రెడ్డి అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా […]</p>

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో కారులో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. బొమ్మలరామారం మండలం పెద్దపర్వాతపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న ప్రవీణ్, రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మరో నిందితుడు భాస్కర్ రెడ్డి పరారీలోఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కాటన్ పెట్టెల్లో 3000 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. బాల్‌రెడ్డి అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా తొగుట వద్ద మ్యాక్సయిన్ (పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాం) నిర్వహిస్తున్నారు. తన వద్ద భాస్కర్ రెడ్డిని డ్రైవర్‌గా నియమించుకున్నాడు. బాల్‌రెడ్డి అంకిరెడ్డిపల్లి వద్ద సాల్వో కంపెనీలో పేలుడు పదార్థాలను ఆన్ లైన్‌లో బుక్ చేశాడు. వాటిని తీసుకురావడానికి వెళ్లిన డ్రైవర్ భాస్కర్ రెడ్డి డీసీఎం వ్యాన్‌లో రెండు కాటన్ల ఎలక్ట్రిక్ డిటోనేటర్లను ఉంచి, ఆ సమాచారాన్ని ప్రవీణ్, రాజశేఖర్‌కు తెలిపాడు. వారు వచ్చి రెండు కాటన్ల డిటోనేటర్లను కారులో లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.






