2022 వరకూ సీఎస్కేతోనే ధోనీ

by  |
2022 వరకూ సీఎస్కేతోనే ధోనీ
X

దిశ, స్పోర్ట్స్: ఏడాది నుంచి క్రికెట్(Cricket) ఆడకపోయినా ధోనీ(Dhoni) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ప్రపంచ కప్(World Cup) తర్వాత ఆటకు దూరం కావడంతో ఇక తిరిగి ఫీల్డ్‌లో అడుగుపెట్టడని భావించారు. అయితే అందరి కంటే ముందే ఐపీఎల్(IPL) ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కరోనా కారణంగా సీజన్ వాయిదా పడటంతో ఇంటికే పరిమితం అయిన ధోనీ, ఇప్పుడు యూఏఈలో ఐపీఎల్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు.

కాగా, ధోనీ ఎన్ని రోజులు క్రికెట్ ఆడతాడు? ఐపీఎల్‌లో ఎప్పటి వరకు కొనసాగుతాడని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ శుభవార్త చెప్పారు. ఈ సీజన్‌కే కాకుండా 2021, 2022 సీజన్లలో కూడా ధోనీ చెన్నై జట్టు(Chennai team)లో భాగమవుతాడని తేల్చి చెప్పాడు. ధోనీ ఉన్నంత కాలం జట్టుకు ఆయనే కెప్టెన్(Captain) అని కూడా స్పష్టం చేశాడు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టుతోపాటు కుటుంబాలు యూఏఈ వచ్చేందుకు అనుమతులు లేవని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ‘లీగ్ మొదటి భాగంలో ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ ఫ్యామిలీస్‌కి అనుమతి లేదు. జట్టుతో పాటు ఫ్యామిలీస్‌ యూఏఈకి రావడం లేదు. యూఏఈ పరిస్థితులను బట్టి రెండో భాగంలో ఫ్యామిలీస్‌ని అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటాం’ అని విశ్వనాథన్ తెలిపారు.



Next Story

Most Viewed