క్షణం క్షణం ఉత్కంఠ.. ఆ అధ్యక్ష పదవి ఎవరికి ?

by Sridhar Babu |   (  Updated:2021-09-23 00:18:19  IST  )

<p>దిశ ,ఇల్లందు: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇల్లందు పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి పట్టణంలో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో ఎక్కడ లేనంతగా ఇల్లందు పట్టణంలో తగ్గ పోరు నడుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఆ నాయకులు ఎమ్మెల్యే వద్ద తమ లాబీయింగ్ జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే అధ్యక్ష పదవి ఎంపిక ఎమ్మెల్యే చేయనున్న నేపథ్యంలో ఆమె ఆశీస్సులు ఎవరికి [&hellip;]</p>

క్షణం క్షణం ఉత్కంఠ.. ఆ అధ్యక్ష పదవి ఎవరికి ?
X

దిశ ,ఇల్లందు: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇల్లందు పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి పట్టణంలో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో ఎక్కడ లేనంతగా ఇల్లందు పట్టణంలో తగ్గ పోరు నడుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఆ నాయకులు ఎమ్మెల్యే వద్ద తమ లాబీయింగ్ జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే అధ్యక్ష పదవి ఎంపిక ఎమ్మెల్యే చేయనున్న నేపథ్యంలో ఆమె ఆశీస్సులు ఎవరికి ఉంటాయో అని టీఆర్ఎస్ పట్టణ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఎవరి బలం ఎంత….?

టీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్ష పీఠం కోసం ఇల్లందు పట్టణానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులిగండ్ల మాధవరావు, పరుచూరి వెంకటేశ్వర్లు పోటీ పడుతున్నారు. పులిగండ్ల మాధవరావు 1983 నుంచి 2013 వరకు టీడీపీ పార్టీలో ఇల్లందు పట్టణ మునిసిపల్ వైస్ చైర్మన్ గా, ఇల్లందు పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ జిల్లా కార్యవర్గ నాయకుడిగా, 2017 నుండి రైతు సమన్వయ సమితి సభ్యునిగా అనేక పదవులలో పని చేసిన అనుభవం, పట్టణంలోని ప్రజలతో, రాజకీయ నాయకులతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. అంతే కాకుండా ఆయనకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్ తో సత్సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అవకాశం.

పరుచూరి వెంకటేశ్వర్లు 1983 నుండి 2014 వరకు టీడీపీ పార్టీలో పని చేసిన అనుభవం, రెండుసార్లు పట్టణ అధ్యక్ష పదవి, టీడీపీ జిల్లా నాయకుడు‌గా, నామా నాగేశ్వరరావు అనుచరుడిగా ఇల్లందు పట్టణంలోని రాజకీయ నాయకులతో, ప్రజలతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈయనకు కూడా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్‌తో సత్సంబంధాలను కలిగి ఉండడం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు‌గా పనిచేసిన అనుభవం ఉంది. టీఆర్ఎస్ పార్టీ పరిశీలనలో పులిగండ్ల మాధవరావు పేరే ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది . ఇల్లందు నియోజవర్గ టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను సాయంత్రం కల్లా ప్రకటించే అవకాశం ఉన్నందున ఇద్దరిలో ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరికి ఉంటాయో అని ఇల్లందు పట్టణ టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.

Next Story