బద్వేలు ఉపపోరులో ముగిసిన నామినేషన్ల పరిశీలన

by  |
Badvelu by-election
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. తాజాగా సోమవారం రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ నామినేషన్లను పరిశీలించారు. గడువు ముగిసే సమయానికి మొత్తం 27 మంది అభ్యర్థులు… 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు గుర్తించారు. ఈ నామినేషన్లను పరిశీలించిన కేతన్ గార్గ్ తొమ్మిదింటిని తిరస్కరించారు. మెుత్తం ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వెల్లడించారు.

మరోవైపు ఈనెల 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు అని స్పష్టం చేశారు. ఇకపోతే ఈనెల 30న ఉపఎన్నిక జరుగుతుండగా..నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.దాసరి సుధ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సురేశ్ సైతం ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన సంగతి తెలిసిందే.



Next Story