- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు కేసీఆర్‌దైనా స్టీరింగ్ ఒవైసీదే !
<p>• మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దిశ,న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది కారు పార్టీ అధినేత కేసీఆర్ అయినా.. కారు స్టీరింగ్ మాత్రం అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తానని గుడ్లురిమిన కేసీఆర్.. పాతబస్తీలో దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే కనెత్ని చూసే సోయిని కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాములు నాయక్ మీడియా సమావేశంలో […]</p>

• మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
దిశ,న్యూస్‌బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది కారు పార్టీ అధినేత కేసీఆర్ అయినా.. కారు స్టీరింగ్ మాత్రం అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తానని గుడ్లురిమిన కేసీఆర్.. పాతబస్తీలో దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే కనెత్ని చూసే సోయిని కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాములు నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభాగ్యురాలిపై అత్యాచారం చేసిన షకిల్ ఎంఐఎం నాయకుడు కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎంఐఎం అంటే భయమని ఎద్దేవా చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒవైసీ సోదరులు హర్ట్ అవుతారని కేసీఆర్ భయపడుతున్నారని రాములు నాయక్ విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఇంటి వెనకాలే అత్యాచార ఘటన జరిగిందని తెలిసినా.. బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయారన్నారు. అదే ప్రియాంకారెడ్డి ఇంటికి పోయి పరామర్శించిన హోం మంత్రి.. దళిత బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.






