- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్‌లో వీవీ ప్యాట్లు తారుమారయ్యాయా..? సీఈవో కీలక ఆదేశం
by Shyam |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం వీవీ ప్యాట్ల తరలింపులో గందరగోళం జరిగిందని, దానికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నేతలు ఆదివారం ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఈవీఎంల విషయంపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం వీవీ ప్యాట్ల తరలింపులో గందరగోళం జరిగిందని, దానికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నేతలు ఆదివారం ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఈవీఎంల విషయంపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్వోలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపుపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో సీఈవో రేపు సమావేశం కానున్నారు.
Next Story






