‘కార్తీక దీపం’చూడాలంటే ఇంట్లోనే ఉండాలి

by  |
‘కార్తీక దీపం’చూడాలంటే ఇంట్లోనే ఉండాలి
X

కరోనా ప్రభావంతో షూటింగ్ లు అన్నీ బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ లతో పాటు సీరియల్స్ షూటింగ్, వెబ్ సిరీస్ లు ఇలా అన్నీ కూడా బంద్ అయ్యాయి. అయితే తినడానికి తిండి లేకపోయినా ఒప్పుకుంటారేమో కానీ.. రాత్రి 7.30 వచ్చే కార్తీకదీపం సీరియల్ ప్రసారం కాకపోతే కోట్లాది మంది ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థతి. అయితే షూటింగ్ చేసిన ఎపిసోడ్స్ ఎక్కువగా బ్యాకప్ లేకపోవటంతో శుక్రవారం నాటితో సీరియల్ ఆగిపోయింది.

ప్రస్తుతం అన్నీ చానెల్స్ లోనూ సినిమాలు మాత్రమే వేస్తున్నారు. సీరియల్ నిలివేయటంతో కార్తీకదీపం ఫ్యాన్స్ వంటలక్క కోసం వంటలు మానేసి మరీ ఎదురుచూస్తున్నారు. అసలే సీరియల్ మంచి రసపట్టులో ఉంది. వంటలక్క డాక్టర్ బాబుని కలుస్తుందా? చిచ్చర పిడుగులు సౌర్య, హిమలు డాక్టర్ బాబు, వంటలక్కల్ని కలుపుతారా? మౌనిక కుట్రలకు సౌందర్య ఎలా కళ్లెం వేస్తుంది? లాంటి ఉత్కంఠ కలిగించే పరిస్థితుల మధ్య కార్తీకదీపం సీరియల్ కు బ్రేక్ పడింది.

కాగా కార్తీక దీపం సీరియల్ నిలిచిపోవటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఓ రేంజల్ లో నడుస్తున్నాయి. అయ్యో అని బాధపడుతుండేవారు కొందరైతే దరిద్రం పోయిందని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వంటలక్కచేతులు జోడించి..నేను డాక్టర్ బాబు కలిసే సీన్ మీరు చూడాలని లేదా..?అలా చూడాలంటే మీరు బతికుండాలిగా..అందుకే ఇంకొన్నాళ్లు ఓపికపట్టి, ఇంటి పట్టునే ఉండి మిమ్మళ్ని మీరు కాపాడుకోండంటూ వంటలక్క చెప్తున్నట్టుగా ఉన్న మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

tags;karthika deepam, serial,should in home,vantalakka


Next Story

Most Viewed