- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో సంచలన ఘటన.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు చేసిన పనికి అంతా షాక్!(వీడియో)
విమానం గాల్లో ఉండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది

దిశ,వెబ్‌డెస్క్: విమానం గాల్లో ఉండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ కేకలు పెట్టడం తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయంలోకి వెళితే.. ఈజీజెట్ విమానం లండన్‌లోని ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో వెళుతున్న ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుల్లో నుంచి ఓ వ్యక్తి లేచి విమానంలో బాంబు పెట్టబోతున్నానని కేకలు వేశాడు.
అంతటితో ఆగకుండా.. ‘‘డెత్ టూ అమెరికా.. డెత్ టూ ట్రంప్’’ అంటూ నినాదాలు చేస్తూ.. అల్లా హో అక్బర్ అంటూ పెద్ద పెద్ద కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకుని బంధించారు. అనంతరం విమానం ల్యాండ్ కాగానే గ్లాస్గో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎందుకు అలా అరిచాడు.. అతని వెనుక ఎవరైనా ఉన్నారనే విషయం పై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Video






