- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగను సంతోషంగా జరుపుకోవాలి….
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బతుకమ్మ పండుగా సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆయన అన్నారు. అలాంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బతుకమ్మ పండుగా సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆయన అన్నారు. అలాంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. గోదావరి జలాల బతుకమ్మ పండుగ చేసుకుంటాం అన్న మాటను నిజం చేశామని అన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న గోదారమ్మ, నిండు కుండలా ఉన్న చెరువుల్లో నేడు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Next Story






