ఈవినింగ్ స్నాక్స్.. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామా!

191

దిశ, శేరిలింగంపల్లి : ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ మాత్రమే కాదు సాయంకాలం స్నాక్స్ తినడం నగర జనాలకు పరిపాటిగా మారింది. మూడు పూటలే కాదు నాలుగో పూట కూడా లైట్‌గా లాగించేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఇది ఓ అలవాటుగా మారింది. సమయం దొరికితే చాలు.. సాయంకాలం పూట అలా వీధుల్లోకి వెళ్లి స్నేహితులతో కలిసి కొందరు, ఫ్యామిలీతో కలిసి ఇంకొందరు రకరకాల స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. మనసుకు నచ్చింది ఆర్డర్ చేసి మరీ ఇష్టంగా తింటున్నారు. సిటీలో ఇప్పుడు వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వసల జీవులు జీవనోపాధి పొందుతున్నారు.

మారిన ఫుడ్ కల్చర్..

సిటీ ఫుడ్ కల్చర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈవినింగ్ టైంలో కాస్త రిలాక్స్ అవుతూ ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేస్తూ లాగించే ఫుడ్స్‌కి బాగా క్రేజ్ పెరిగింది. ఇందుకోసం నగరంలో వేలాదిగా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హోటల్స్ వెలిశాయి. ఇది వరకు సిటీలో ఈవినింగ్ స్నాక్స్ అంటే పానీపూరి, మిర్చి బజ్జీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తకొత్త రుచులు పరిచయం చేస్తున్నారు హోటల్స్, స్ట్రీట్ వెండర్స్. సిటీలో కొన్ని స్పాట్స్ ఈవినింగ్ స్నాక్స్‌కు ఫుల్ ఫేమస్. గచ్చిబౌలి డీఎల్ఎఫ్, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీల్లో ఈతరహా ఫుడ్ స్టాల్స్‌కు బాగా డిమాండ్ ఉంది.

మిర్చీ బజ్జీ, పానీపూరికి ప్రయార్టీ..

ఈవినింగ్ స్నాక్స్ లో ఆల్ టైమ్ అందరి ఫస్ట్ ప్రియార్టీ మిర్చిబజ్జీ, ఆ తర్వాత ప్లేస్ లో పానీపూరి, సమోసా, నూడుల్స్, ముంతమసాలా, ఇతర ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ మిర్చీబజ్జీ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ వందలాదిగా వెలిశాయి. ఎక్కడ చూసినా ఇవే స్టాల్స్ కనిపిస్తుంటాయి. అక్కడ జనాలు కూడా అదే స్థాయిలో ఉంటారు. శేరిలింగంపల్లి తుల్జాభవానీ టెంపుల్ వద్ద మిర్చీ బజ్జీ కోసం వెయింటింగ్ లో ఉంటారు జనాలు. నగరంలో చాలాచోట్ల స్నాక్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఇక పానీపూరి అయితే గల్లీకో బండి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొందరు తలపై పెట్టుకుని బస్తీల్లో తిరుగుతూ కూడా విక్రయిస్తున్నారు. పానీపూరి తినే విషయంలో అమ్మాయిలు ముందు వరుసలో ఉంటారు. కాలేజీలు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తూ వీటిని తిని వెళ్లే వారు చాలామంది ఉన్నారు.

చైనీస్ వంటకాలపై మక్కువ..

నగరంలో చైనీస్ ఫుడ్‌కు మంచి డిమాండ్ ఉంది. వాటిలో నూడుల్స్, మంచూరియాకు మంచి క్రేజ్ ఉంది. అబ్బాయిలు ఇష్టపడే ఫుడ్ ఐటెమ్స్‌లో ఫస్ట్ ప్రియార్టీ నూడుల్స్, మంచూరియా ఇందులో రకరకాలా వెరైటీలు ఉన్నాయి. మంచూరియాలో డ్రై, వెట్ అంటూ.. స్పైసీ, నార్మల్ టేస్ట్‌తో దొరుకుతున్నాయి. ఇక నూడుల్స్‌ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఇష్టపడే ఫుడ్. అలాగే పాస్తా వెరైటీలకు క్రేజ్ పెరిగింది. ఇప్పుడు చైనీస్ ఫుడ్ కోర్టులూ పెరిగాయి. స్టార్ హోటల్స్‌లోనే లభించే చైనీస్ వంటకాలు ఇప్పుడు వీధి చివర్లోనే అందరికి అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ వెరైటీ స్నాక్స్ లభిస్తున్నాయి. హాస్టల్స్, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ తరహా స్నాక్స్ స్టాల్స్, బండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి పిండి వంటల పేరుతో వీధుల్లో దుకాణాలకు డిమాండ్ ఉంది. సాయంకాలం పూట కబాబ్స్ టేస్ట్ చేసే వారు కూడా ఎక్కువే. అలాగే జొన్నరొట్టె, సూప్స్ కూడా లభిస్తున్నాయి. అయితే స్ట్రీట్ ఫుడ్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..