- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేమేమైనా నక్సలైట్లమని అనుకుంటున్నారా…? ఈటల స్ట్రాంగ్ వార్నింగ్
<p>దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని పోలీసులను హెచ్చరించారు. ‘మేమేమైనా నక్సలైట్లమని అనుకుంటున్నారా..? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. గులాబీ కండువాలు వేసుకోండి.. సీఎం కేసీఆర్‌కు బానిసలమని ప్రకటించుకోండి’ అని హాట్ కామెంట్స్ చేశారు. తన వల్లే దళితులకు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని, టీఆర్‌ఎస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని పోలీసులను హెచ్చరించారు. ‘మేమేమైనా నక్సలైట్లమని అనుకుంటున్నారా..? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. గులాబీ కండువాలు వేసుకోండి.. సీఎం కేసీఆర్‌కు బానిసలమని ప్రకటించుకోండి’ అని హాట్ కామెంట్స్ చేశారు.
తన వల్లే దళితులకు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని, టీఆర్‌ఎస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని తనకు ఓటు వేయాలని ఈటల కోరారు. కాగా, హుజురాబాద్ ఉపఎన్నికల క్రమంలో ఈటల పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.
Next Story






