ఈటల రాజేందర్ అభిమాని ఆత్మహత్యాయత్నం…

by Chintha Aamani |   (  Updated:2021-05-02 10:58:39  IST  )

<p>దిశ,బెల్లంపల్లి : ఈటల రాజేందర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి తొలగించారని మనస్తాపంతో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి వెంకటేష్ కిరోసిన్ పోసుకుని ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కరోనా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలు అడ్డుపెట్టి ఎంతోమంది పేదవారికి అండగా ఉంటూ, పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఈటల రాజేందర్‌కి టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టినట్లు బాధితుడు పేర్కొన్నాడు. [&hellip;]</p>

ఈటల రాజేందర్ అభిమాని ఆత్మహత్యాయత్నం…
X

దిశ,బెల్లంపల్లి : ఈటల రాజేందర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి తొలగించారని మనస్తాపంతో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి వెంకటేష్ కిరోసిన్ పోసుకుని ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కరోనా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలు అడ్డుపెట్టి ఎంతోమంది పేదవారికి అండగా ఉంటూ, పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఈటల రాజేందర్‌కి టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా రోడ్డుపై వస్తున్న వ్యాన్ కింద పడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి నుండి తరలించారు. కాగా, వెంకటేష్ గత ఐదు సంవత్సరాలుగా ఈటల యువసేన పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

Next Story