- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ బ్రోకర్ మాటలు ఎవరూ నమ్మరు.. హరీష్‌పై ఈటల ఫైర్
<p>దిశ, జమ్మికుంట: గెస్టు హౌస్‌లలో కూర్చొని కుట్రలు చేస్తే ఎవరూ నమ్మరని, నీవు చెప్పేవన్నీ బ్రోకర్ మాటలని మరోమారు మంత్రి తన్నీరు హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసినప్పుడు దళితుల భూములు ఆక్రమించానని చెప్పారని, ఇప్పుడేమో […]</p>

దిశ, జమ్మికుంట: గెస్టు హౌస్‌లలో కూర్చొని కుట్రలు చేస్తే ఎవరూ నమ్మరని, నీవు చెప్పేవన్నీ బ్రోకర్ మాటలని మరోమారు మంత్రి తన్నీరు హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసినప్పుడు దళితుల భూములు ఆక్రమించానని చెప్పారని, ఇప్పుడేమో ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టానని మహిళలతో చెప్పడంతోనే నీ అబద్దాల కోరు బయటపడిందని హరీష్ రావు తీరుపై మండిపడ్డారు. నీతో పాటు 18 ఏళ్ల పాటు ఉద్యమంలో పని చేశానని, నీ వెలా ఉద్యమకారుడివో నేను కూడా అలాగే ఉద్యమకారుడినని గుర్తు చేశారు. నాపై చేసిన ఆరోపణలు నిజమేనని గుండెలపై చేయి వేసుకొని చెప్పగలవా, ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారి పోయావు మిత్రమా అంటూ ఈటల రాజేందర్ మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జితేందర్ రెడ్డి, అశ్వత్థామ రెడ్డి తదితరులు ఉన్నారు.






