నీ భార్యనడుగు హరీష్ రావు.. ఆ బాధ నీకు తెలియదా: ఈటల

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: మిత్రమా హరీష్ రావు ఆ బాధలన్నీ నీకు తెలియవా..? నీవు అనుభవించలేదా? నీవు అబద్ధాలు ఆడుతున్నావు.. కావాలంటే నీ ఇల్లాలినడుగు, తడిచిపోయిన మెత్త(దిండు)నడుగు అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టానని మహిళతో హరీశ్ రావు చెబుతున్నారని, కానీ తమను మనుషులుగా చూడాలని.. ప్రజల కష్టాలు తీర్చాలని అడిగా.. ఇది తప్పా అని ప్రశ్నించారు [&hellip;]</p>

నీ భార్యనడుగు హరీష్ రావు.. ఆ బాధ నీకు తెలియదా: ఈటల
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మిత్రమా హరీష్ రావు ఆ బాధలన్నీ నీకు తెలియవా..? నీవు అనుభవించలేదా? నీవు అబద్ధాలు ఆడుతున్నావు.. కావాలంటే నీ ఇల్లాలినడుగు, తడిచిపోయిన మెత్త(దిండు)నడుగు అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టానని మహిళతో హరీశ్ రావు చెబుతున్నారని, కానీ తమను మనుషులుగా చూడాలని.. ప్రజల కష్టాలు తీర్చాలని అడిగా.. ఇది తప్పా అని ప్రశ్నించారు

ఫామ్ హౌస్‌, ప్రగతి భవన్‌లో ఉండే నీకు నాలాంటి వాళ్లు చెప్పకపోతే ఎలా తెలుస్తాయి.. రాజులు కూడా మారువేషాల్లో తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని తెలుసుకునేవాళ్లు.. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు, అధికారులు, నాయకులను కలవరని విమర్శించారు. ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రులు ప్రజలను కలుసుకునేవారని, చివరకు మాలాంటి వాళ్లను కూడా ప్రగతి భవన్ గేట్ల దగ్గరే పోలీసులు ఆపేవారన్నారు.

అనవసరంగా ఓ పత్రికలో ఫేక్ ఫొటోలు పెడుతూ అసత్య ప్రచారం చేయిస్తున్నారని.. వర్షానికో, గాలి దుమారానికో అవి కొట్టుకుపోతాయన్నారు. కానీ ప్రజల గుండెల్లో నిలిచిన ఈటల రాజేందర్ చిరస్థాయిగా ఉంటాడని చెప్పారు. నాలాంటి వాన్ని గడ్డిపోచలాగా ఊదాలనుకున్నాడు కానీ, నేను గడ్డిపోచ కాదు గడ్డపారనని కేసీఆర్‌కు అర్థమైందని వ్యాఖ్యానించారు. పలువురిని బలవంతంగా టీఆర్ఎస్‌ పార్టీ్లోకి ఆహ్వానిస్తున్నారని… ఇష్టం లేని సంసారం ఎలా నడవదో బలవంతంగా కండువా కప్పినా సక్సెస్ కాదని ఈటల స్పష్టం చేశారు.

Next Story