తెలంగాణ‌ భవిష్యత్‌ బీజేపీదే: ఈటల రాజేందర్‌

95

దిశ, షాద్‎నగర్: రాష్ట్రంలో ఇక భవిష్యత్ భారతీయ జనతా పార్టీదేనని, వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మలేదని, ధర్మం వైపు నిల్చున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దీనికి షాద్‌నగర్ నుండి బీజేపీ నాయకులు తరలివెళ్లారు. ఎన్నికలలో తన గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య శ్రేణులను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా హుజురాబాద్ ఫలితమే రిపీట్ అవుతుందని, టీఆర్ఎస్‌ను ప్రజలు రాజకీయంగా బొందపెట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నేతలు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, అంజన్ కుమార్ గౌడ్, నర్సింహులు యాదవ్, రఘురాములు గౌడ్, సొప్పరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..