Eatala Rajendar: అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్లే..! ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-08-15 11:54:48  IST  )

అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల వస్తున్నాయని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajendar: అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్లే..! ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యధిక మరణాలు (Cancer) క్యాన్సర్ వల్ల వస్తున్నాయని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. మనం టెస్ట్ చేసుకుంటే తప్ప బయటపడే ప్రసక్తి లేదు కాబట్టి మనం తప్పకుండా ఈ క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఉప్పల్‌లోని బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన, ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. నేను హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు కరోనా టైమ్‌ కాబట్టి సంపూర్ణంగా పని చేసే అవకాశం లేకపోయిందని తెలిపారు. ఎంఎన్‌జే, నిమ్స్ హాస్పిటల్స్‌లో లేటెస్ట్ పరికరాలను తీసుకొచ్చి పెట్టామని, సీఎస్ఆర్ ఫండ్ కింద రూ. 40 కోట్లతో కొత్త హాస్పిటల్ కట్టించామని గుర్తుకుచేశారు.

నేను ఎంపీ అయిన తర్వాత సీఎస్ఆర్ ఫండ్ కింద కోటి రూపాయలు వస్తే వాటితో నాలుగు స్క్రీనింగ్ మిషన్లు తీసుకున్నట్లు వివరించారు. అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలు వచ్చాయి కాబట్టి చిన్న మిషన్‌తో కూడా కాన్సర్‌ను గుర్తించవచ్చని, ఈ మధ్య కాలంలో కిడ్నీ, లంగ్, మౌత్ క్యాన్సర్లు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. కాన్సర్ కు చిన్న పెద్ద తేడా లేదన్నారు. ఉన్నోళ్లకు వచ్చిన గుడిసెల్లో వారికి వచ్చిన అదే ఖర్చు అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ మ‌ధ్య కాలంలో మహిళలకు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ ఇంకా రకరకాల క్యాన్సర్ ఎక్కువ మందిలో చూస్తున్నట్లు తెలిపారు.

నేడు కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు మహిళలు మాత్రమే, ఆ మహిళలు కుటుంబంలో లేకపోతే అందకారంగా మారే ఆస్కారం ఉందన్నారు. బసవతారకం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసేదే కాక ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలని కోరారు. ఈ స్క్రీనింగ్ మిషన్ల కోసం, ట్రీట్మెంట్ కోసం మా వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు.

Next Story