ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. యువతకు కీలక సూచనలు

by Sridhar Babu |

<p>దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంటలో యువకులతో నిర్వహించిన సభలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ ఓడిపోతుందని, బీజేపీ గెలవగానే కేసీఆర్ పాలనను కూల్చడమే ధ్యేయంగా పని చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఆటలు ఆడుతుందన్నారు. హుజురాబాద్ ప్రజలు మద్యం, డబ్బులకు లొంగరని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ [&hellip;]</p>

Etala Rajender
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంటలో యువకులతో నిర్వహించిన సభలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ ఓడిపోతుందని, బీజేపీ గెలవగానే కేసీఆర్ పాలనను కూల్చడమే ధ్యేయంగా పని చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఆటలు ఆడుతుందన్నారు. హుజురాబాద్ ప్రజలు మద్యం, డబ్బులకు లొంగరని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ ఇప్పటి వరకు 5 లేఖలు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు భయపెట్టినా ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. ఈ నెల 27 తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోతారు, ఆ తర్వాత మద్యం, డబ్బు ఊళ్లోకి రాకుండా అడ్డుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

Next Story