హుజురాబాద్ ఓటర్లకు ఈటల రాజేందర్ కీలక సూచన..

by Sridhar Babu |

<p>దిశ, జమ్మికుంట : కేసీఆర్ కుట్రలకు చమరగీతం పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో జరగబోయే ఉపఎన్నిక కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పారు. గురువారం ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, కమలాపూర్ మండలం శంభునిపల్లి, జమ్మికుంట మండలం మాచనపల్లి, జమ్మికుంట పట్టణ పరిధిలోని 30వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు, పలువురు సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ [&hellip;]</p>

హుజురాబాద్ ఓటర్లకు ఈటల రాజేందర్ కీలక సూచన..
X

దిశ, జమ్మికుంట : కేసీఆర్ కుట్రలకు చమరగీతం పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో జరగబోయే ఉపఎన్నిక కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పారు. గురువారం ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, కమలాపూర్ మండలం శంభునిపల్లి, జమ్మికుంట మండలం మాచనపల్లి, జమ్మికుంట పట్టణ పరిధిలోని 30వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు, పలువురు సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రోత్సాహంతో అధికారులు, పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. హుజురాబాద్ నియోజవర్గంలో వచ్చిన ప్రతీ పథకం ఈటల రాజీనామా వల్లే సాధ్యమైందని, ప్రజలు పథకాలు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి అడ్డగోలుగా నాయకులను కొనుగోలు చేస్తున్నారని, వారందరికీ తగిన బుద్ధి చెప్పాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story