- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవిడ్ వార్డును వదలని మంత్రి ఎర్రబెల్లి
by Shyam |
<p>దిశ, పోచమ్మమైదాన్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స సదుపాయాలు, పౌష్టికాహారం, పీపీఈ కిట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితోనే కాకుండా పీపీఈ కిట్ ధరించి కోవిడ్ పేషెంట్ల వద్దకు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రిలో డాక్టర్లు వైద్య చికిత్స ఎలా చేస్తున్నారని.. ఆక్సిజన్ సరఫరా ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఎక్విప్‌మెంట్ కొరత ఉంటే వెంటనే […]</p>

X
దిశ, పోచమ్మమైదాన్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స సదుపాయాలు, పౌష్టికాహారం, పీపీఈ కిట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితోనే కాకుండా పీపీఈ కిట్ ధరించి కోవిడ్ పేషెంట్ల వద్దకు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రిలో డాక్టర్లు వైద్య చికిత్స ఎలా చేస్తున్నారని.. ఆక్సిజన్ సరఫరా ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఎక్విప్‌మెంట్ కొరత ఉంటే వెంటనే అందుబాటులోకి తెప్పించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. రోగుల పరిస్థితిని నిరంతరం పరీక్షిస్తూ.. ప్రాణ నష్టం కాకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులు, వైద్యులను ఆదేశించారు. ఇదే సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు.
Next Story






