- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాట్ పట్టిన మంత్రి ఎర్రబెల్లి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడు ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలతో బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రయాణంలో భాగంగా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో కొద్దిసేపు ఆగారు. అదే సమయంలో ఆ పక్కన ఉన్న గ్రౌండ్‌లో కొంత మంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. కొద్దిసేపు వారితో కలిసి […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడు ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలతో బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రయాణంలో భాగంగా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో కొద్దిసేపు ఆగారు.
అదే సమయంలో ఆ పక్కన ఉన్న గ్రౌండ్‌లో కొంత మంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. కొద్దిసేపు వారితో కలిసి మంత్రి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టి బంతులని ఎదుర్కొన్నారు. కాగా హఠాత్తుగా తమ మధ్యకు ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యక్షమై, తమతోనే క్రికెట్ ఆడటం వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి తమతో కలిసి పోవడం ఆ పిల్లల్ని ఎంతో ఆనందపరిచింది.
Next Story






