22.55 కోట్ల మంది ఖాతాదారులకు వడ్డీ జమ చేసిన ఈపీఎఫ్ఓ!

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 22.55 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల ఖాతాదాల్లో 8.50 శాతం వడ్డీని జమచేసినట్టు రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ సోమవారం ఓ ప్రకటించింది.

పీఎఫ్ పెట్టుబడులపై ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. డిపాజిట్ల కంటే విత్‌డ్రాలు అధికంగా ఉన్న కారణంగానే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచారు. ఈ ఏడాది అక్టోబర్ 30న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన సంగతి తెలిసిందే.

భారత్‌లో కొవిడ్-19 మహమ్మారి సంక్షోభ పరిస్థితులు మొదలైన తర్వాత ఈపీఎఫ్ఓ 2019-20 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 7 ఏళ్ల కనిష్ఠానికి అంటే 8.5 శాతానికి తగ్గింది. అప్పటి నుంచి దీన్ని సవరించలేదు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 8.65 శాతంగా ఉండేది. 2017-18లో 8.55 శాతంగానూ, 2016-17లో 8.65 శాతంగా ఈపీఎఫ్ వడ్డీ రేటు ఉంది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed