- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వినాయక ఉత్సవాల్లో పర్యావరణ స్పృహ.. వినూత్నంగా వేడుక
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా కారణంగా గత రెండుసార్లు నిరాడంబరంగా నిర్వహించినా.. ఈసారి మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్ స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజూ దాదాపు 200లకు పైగా కుటుంబాలు ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో మండప నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా కారణంగా గత రెండుసార్లు నిరాడంబరంగా నిర్వహించినా.. ఈసారి మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్ స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజూ దాదాపు 200లకు పైగా కుటుంబాలు ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి.

ఈ నేపథ్యంలో మండప నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా చిన్నారులలో పర్యావరణ స్పృహ కల్గించడానికి మట్టితో వినాయక ప్రతిమల తయారు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కమ్యూనిటీకి చెందిన బాల, బాలికలు రోజూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కమెడియన్ రాకింగ్ రాకేశ్ వేడుకలకు హాజరై సందడి చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వందలాది మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అన్నదానం, గణపతి హోమం నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. నీటిని చిమ్మడం ద్వారా విగ్రహాన్ని కాలనీలోనే నిమజ్జనం చేయనుండడం విశేషం.






