- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యావరణహిత వాహనాలను వినియోగించాలి :హోంమంత్రి మహమూద్ అలీ
అందరూ పర్యావరణ హిత వాహనాలను వినియోగించాలని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని నలంద నగర్ లో స్టార్ ఎంటర్ ప్రైజెస్ ఈ బైక్ షో రూమ్ ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.

X
దిశ, రాజేంద్రనగర్: అందరూ పర్యావరణహిత వాహనాలను వినియోగించాలని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని నలంద నగర్ లో స్టార్ ఎంటర్ ప్రైజెస్ ఈ బైక్ షో రూమ్ ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలను వినియోగించడం తో పర్యావరణ కాలుష్యం అవుతుందని తెలిపారు. దీంతో అందరూ బ్యాటరీలతో నడిచే ఈ వాహనాలను వాడాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, స్థానిక కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్ షోరూంను సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అరవింద్, మంతటి నర్సింగ్, కార్బన్ నియోజకవర్గం బీఆర్ఏ అభ్యర్థి మిత్ర కృష్ణ, రాష్ట్ర కురుమ సంఘం యువజన విభాగం తుంకుంట అరుణ్ కుమార్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






