దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఇండియా టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా ఒకటి భారత్, ఒకటి ఇంగ్లాండ్ గెలుచుకున్నాయి. మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ప్రపంచంలోనే అతిపెద్దదైన గుజరాత్‌లోని మోతేరా స్టేడియంలో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి ఆర్చర్ వ్యాఖ్యలపై టీమ్ ఇండియా ప్లేయర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
భారత్‌తో టెస్టు సిరీస్ మేమే గెలుస్తాం : జోఫ్రా ఆర్చర్
గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబర్ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..