హీరోయిన్లకు ముద్దులుపెట్టి అలిసిపోయా అంటున్న ఆ హీరో

by  |
imran
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఎంటైర్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ముద్దు సీన్లు లేని సినిమాలు చాలా తక్కువ. అందుకే తనపై ‘సీరియల్ కిస్సర్‌’ అనే ట్యాగ్ పడిపోయింది. ఆ నిక్ నేమ్‌ను తొలగించుకునేందుకు ఇప్పుడిప్పుడే వెర్సటైల్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్న ఇమ్రాన్.. తనలోని నటున్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆన్‌స్క్రీన్ క్యారెక్టర్‌ను వివరించే క్రమంలో ‘సీరియల్ కిస్సర్’ అనే ట్యాగ్‌ను తనే మెన్షన్ చేశానని, క్రమంగా అదే ఇమేజ్ ఆపాదించబడిందని పేర్కొన్నాడు. కెరీర్‌లో మొదటి పది సంవత్సరాలు రొమాంటిక్ మూవీస్ చేయడంతో దురదృష్టవశాత్తు ఈ ట్యాగ్ ఇవ్వబడిందని, ఆ తర్వాత మీడియా కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేసిందని అభిప్రాయపడ్డాడు. 2003 పీరియడ్‌లో హీరోయిన్లతో ఘాటైన ముద్దు సీన్లు చేయడం మొదలుపెట్టినపుడు అది హాట్ టాపిక్‌‌గా మారిందని తెలిపాడు.

Join in Telegram :https://t.me/cutww

దీంతో తన ఇమేజ్‌కు దగ్గరగా ఉండే సినిమాలే చేయాల్సి వచ్చిందని, కానీ ‘తన హీరోయిన్లందరినీ ముద్దుపెట్టుకునే వ్యక్తి’ ప్రస్తుతం అనారోగ్యానికి గురయ్యాడని చెప్పాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలే సాధించినా తనలోని నటున్ని సాటిస్ఫై చేయలేదని వెల్లడించాడు. కాగా ఈ మధ్య డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్న ఇమ్రాన్.. ప్రస్తుతం రూమీ జాఫ్రీ డైరెక్షన్‌లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ‘చెహ్రే రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Next Story